గోపీచంద్ సినిమా ఆడియో విడుదలకు కొత్త తేదీ !

మ్యాచో మ్యాన్ గోపీచంద్ చిత్రం ‘ఆక్సిజన్’ అన్ని పనుల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే ముందుగా ఆడియో వేడుకను ఈ నెల 15న అనగా ఈరోజు నెల్లూరు వేదికగా జరపాలనుకున్నారు. కానీ వ్యక్తిగతమైన పనుల వలన గోపీచంద్ స్విట్జర్ ల్యాండ్ వెళ్లడంతో అది కాస్త వాయిదాపడింది.

దీంతో నిర్మాతలు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 23న హైదరాబాద్లోనే జరపాలని నిర్ణయించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ విరివిగా వాడి రూపొందించిన ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ను శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మించారు.