‘బ్యాచ్‌ల‌ర్’ అవుట్ ఫుట్ పై మేకర్స్ హ్యాపీ !

Published on Jul 25, 2021 12:34 am IST

యంగ్ హీరోయిన్ అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా ఇప్పటికే పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా తాజాగా పూర్తి చేసుకుంది. అయితే, సినిమా ఫస్ట్ కాపీ ఫినిష్ అయిన వెంటనే.. సినిమా యూనిట్ కి ప్రివ్యూ కూడా వేశారని.. సినిమా అవుట్ ఫుట్ పట్ల మేకర్స్ పూర్తి సంతృప్తికరంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :