అదృష్టాన్ని పరీక్షించుకొనున్న యువ దర్శకులు !
Published on Jan 31, 2018 5:02 pm IST

ఈ శుక్రవారం (ఫిబ్రవరి 2న) రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. అందులో ఒకటి రవితేజ ‘టచ్ చేసి చూడు,’ కాగా మరొకటి నాగ శౌర్య ‘ఛలో’. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది ఇద్దరు కొత్త దర్శకులు అవ్వడం విశేషం. ‘టచ్ చేసి చూడు’ సినిమా డైరెక్టర్ విక్రమ్ సిరి కొండ గతంలో చాలా మంది దర్శకుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో విక్రమ్ మొదటిసారి రవితేజను డైరెక్ట్ చేసాడు. వక్కంతం వంశీ అందించిన కథను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు.

‘ఛలో’ సినిమా దర్శకుడు వెంకీ కుడుములు గతంలో తేజ, త్రివిక్రమ్ దగ్గర పనిచేసి మొదటిసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. ఛలో సినిమా సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. లవ్ స్టొరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని దర్శకుడు నమ్మకంగా ఉన్నాడు. ఇద్దరు నూతన దర్శకుల సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. రెండు సినిమాలు విజయం సాధించి ఇద్దరు దర్శకులకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిద్దాం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook