“రాబిన్ హుడ్” లో మరో కొత్త ముఖంతో నితిన్..!

“రాబిన్ హుడ్” లో మరో కొత్త ముఖంతో నితిన్..!

Published on Mar 30, 2024 12:00 PM IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాల్లో తన హిట్ దర్శకుడు వెంకీ కుడుముల తో చేస్తున్న రెండో చిత్రం “రాబిన్ హుడ్” కూడా ఒకటి. మరి టైటిల్ గ్లింప్స్ తోనే మేకర్స్ ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ ని కన్ఫర్మ్ చేయగా దానితోనే ఈ సినిమాకి నితిన్ చేసిన ఇంట్రెస్టింగ్ మేకోవర్ ని కూడా రివీల్ చేశారు.

అయితే ఇప్పుడు ఈరోజు నితిన్ బర్త్ డే కానుకగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేశారు. దీనితో మొదటి లుక్ కి దీనికి ఎలాంటి సంబంధం లేకుండా ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. అలాగే మేకర్స్ ఈ పాత్రని ఏజెంట్ అంటూ రివీల్ చేయడం గమనార్హం. మరి ఈ ఏజెంట్ టైటిల్ కి తగ్గట్టుగానే నితిన్ ఈ కొత్త లుక్స్ లో స్టైలిష్ గా అదిరిపోయాడు.

మరి రాబిన్ హుడ్ గా నితిన్ ఇంకెన్ని సర్ప్రైజ్ లు చూపిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అతి త్వరలోనే సినిమాని మేకర్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు