లేటెస్ట్.. ఆసక్తికరంగా నితిన్ “తమ్ముడు” ఫస్ట్ లుక్

లేటెస్ట్.. ఆసక్తికరంగా నితిన్ “తమ్ముడు” ఫస్ట్ లుక్

Published on Mar 30, 2024 9:42 AM IST

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు చేస్తున్న ఆసక్తికర ప్రాజెక్ట్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హిట్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ తో చేస్తున్న అవైటెడ్ సినిమా “తమ్ముడు” కూడా ఒకటి. మరి మరి ఇది కూడా పవన్ కెరీర్ లో హిట్ సినిమా టైటిల్ కావడంతో దీనిపై మంచి బజ్ నెలకొంది.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ నితిన్ పుట్టినరోజు కానుకగా అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసేందుకు మంచి ఆసక్తిగా ఉందని చెప్పాలి. ఓ గిరిజన మహిళ అగ్రెసివ్ లుక్ లో చుట్ట కాలుస్తూ బస్సు నడుపుతుంటే ఆ బస్సు పైన ఒక ఈటె పట్టుకొని స్టైల్ గా కూర్చుని నితిన్ కనిపిస్తున్నాడు.

దీనితో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కొత్తగా ఉందని చెప్పాలి. ఇక అదే బస్సులో మరికొందరు నటీనటులు కూర్చున్నారు. మొత్తానికి అయితే ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఏదో స్పెషల్ ట్రీట్ నే ప్లాన్ చేసినట్టుగా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు