ధనుష్ “సార్” టీమ్ కి నితిన్ బెస్ట్ విషెస్!

Published on Feb 16, 2023 6:06 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సార్. తమిళం లో వాతి పేరిట రిలీజ్ కానుంది. ఈ చిత్రం ను ఫిబ్రవరి 17, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం కి టాలీవుడ్ హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెస్ తెలిపారు.

రేపటి నుండి సార్ సినిమా థియేటర్ల లో. ఈ చిత్రం గురించి, ఇప్పటికే చాలా గొప్ప విషయాలు విన్నాను. వెంకీ అట్లూరి గారికి కంగ్రాట్స్, అంతేకాక ధనుష్ కి గ్రాండ్ వెల్ కమ్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక నిర్మాత వంశీ కి, చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా,జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :