నితిన్ చేతుల మీదుగా సమంత సినిమా పాట విడుదల !
Published on Mar 6, 2018 7:51 pm IST


తెలుగు స్టార్ హీరోయిన్ సమంత, తమిళ హీరో విశాల్ జంటగా నటించిన చిత్రం ‘ఇరుంబుతిరై’. ఈ చిత్రం తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలకానుంది. షూటింగ్ పనులు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమాలోని మొదటి పాట ‘తొలి తొలిగా తొలకరిగా’ను హీరో నితిన్ మార్చి 8న స్వయంగా రిలీజ్ చేయనున్నారు.

ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 13న విడుదలచేయాలని అనుకున్నా కొని అనివార్య కారణాల వలన వాయిదావేశారు. కొత్త విడుదల తేదీ ఇంకా ప్రకటితం కాలేదు. జార్జి సి. విలియమ్స్‌ సినిమాటోగ్రఫి అందించిన ఈ చిత్రాన్ని మిత్రన్ డైరెక్ట్ చేయగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై రూపొందిన ఈ చిత్రానికి మిత్రన్ దర్శకత్వం వహించారు. హరి వెంకటేశ్వర పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తోంది.

 
Like us on Facebook