నేను జనతా గ్యారేజ్ సినిమా ఒప్పుకోవడానికి అదే కారణం : నిత్యామీనన్
Published on Aug 30, 2016 12:58 pm IST

nitya
సాధారణంగా ఎక్కువమంది హీరోయిన్లకి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే గోల్ ఉంటుంది. కానీ నిత్యా మీనన్ కు మాత్రం స్టార్ డైరెక్టర్లతో పనిచేయాలని ఉంటుంది. అదే ఆమెను ఇతర హీరోయిన్ల నుండి కాస్త వేరుచేసి చూపుతుంటుంది. మంచి నటిగానేకాక సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించింది. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ ‘డైరెక్టర్ శివ నాతో ఈ సినిమాను కమర్షియల్ సినిమాకన్నా ఎక్కువగా తీయాలనుకుంటున్నాను అన్నారు. ఆ మాటే నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం’ అన్నారు.

అలాగే ‘నన్ను దృష్టిలో పెట్టుకుని శివగారు సినిమాలో నా పాత్రను డిజైన్ చేశారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ప్రకృతి గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పాత్ర. కానీ నా క్యారెక్టర్ అతనికి ఆపోజిట్ గా ఉంటుంది. నిజానికి నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. రాక్ ఆన్ బ్రో.. పాటను కేరళలో షూట్ చేసేటప్పుడు నేచర్ కు దగ్గరగా ఉండి చాలా ఎంజాయ్ చేశాం. నాకు కూడా నిజ జీవితంలో అలా ట్రావెల్ చేయడం ఇష్టం. అలా ట్రావెల్ చేస్తూనే హిమాచల్ వెళ్లాను’ అంటూ సినిమా విశేషాలు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది.

 
Like us on Facebook