టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి విడుదలతో దగ్గరకి వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో లేటెస్ట్ గా టికెట్ రేట్స్ హైక్ కోసమే చర్చ నడుస్తుంది. అయితే గత వారం వచ్చిన రూమర్స్ ని మేకర్స్ కొట్టి పడేసారు. ఇక దీనిపై విజయ్ కూడా స్పందించాడు.
కేవలం రణబాలి సినిమాకే కాదు ఇక్కడ నుంచి తన సినిమాలు వేటికీ టికెట్ ధరలు పెంచేది ఉండదు అని రౌడీ హీరో తేల్చేసాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ మెలిక ఒకవేళ తాను దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా చేసేలా ఉంటే తప్ప అప్పుడు వరకు నా సినిమాలకి టికెట్ ధరలు పెంచేది లేదు అని విజయ్ ఒక డేరింగ్ స్టేట్మెంట్ ని జారీ చేసాడు. దీనితో తన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక రణబాలి సినిమా ఈ అక్టోబర్ 16న గ్రాండ్ గా విడుదలకి రాబోతున్న సంగతి తెలిసిందే.


