ప్రస్తుతం నాచురల్ స్టార్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్ కోసం ఒక ఊహించని లుక్ ని తాను సిద్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తి చేసినప్పటికీ నాని అదే లాంగ్ హెయిర్ లో కొనసాగుతూ వచ్చాడు. ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ సుజీత్ తో చేయనున్న బ్లడీ రోమియో సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నాని గ్యాంగ్స్టా లుక్ లోకి మారినట్టు మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇపుడు అందించారు.
తన జడల్ లుక్ నుంచి పూర్తిగా ఫ్రెష్ లుక్ ని సిద్ధం చేస్తున్నట్టుగా వదిలిన వీడియో గ్లింప్స్ మంచి ఆసక్తిగా ఉంది. ఒక వెస్ట్రన్ చెఫ్ లా నాని ఇందులో కనిపిస్తున్నాడు. దీనితో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఈ నెల నుంచే పట్టాలు ఎక్కనుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


