ఆ సినిమా విడుదల తేదిపై ఎలాంటి మార్పు లేదు !
Published on Nov 28, 2017 4:23 pm IST

నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఎంసిఏ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది వరుకే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల చేసారు రేపు రెండో పాటను విడుదల చెయ్యబోతున్నారు.

గతంలో చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. నిన్న జవాన్ సినిమా ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా డిసెంబర్ 21 న విడుదల కాబోతోందని ఖరారు చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

 
Like us on Facebook