“సలార్” సోలో రిలీజ్ మాత్రమే కాదు.!

“సలార్” సోలో రిలీజ్ మాత్రమే కాదు.!

Published on Nov 27, 2022 7:01 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. మరి ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి కూడా ఉన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్లిక్ కూడా ఇదే అని చెప్పవచ్చు. మరి మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు అయినటువంటి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుంది.

ఇక ఇప్పుడున్న లైనప్ అండ్ పరిస్థితుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మాత్రం ఫ్యాన్స్ సలార్ మాత్రమే సోలో ట్రీట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఆదిపురుష్ చిత్రం వాయిదా అని రూమర్స్ గట్టిగా స్ప్రెడ్ అవుతున్నాయి.

అయితే ఒకవేళ ఇది వాయిదా పడ్డా కూడా సలార్ ఒకటే వచ్చే ఏడాదిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే దర్శకుడు మారుతి తో ఓ క్విక్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ చేయనున్నాడు. మరి ఇది త్వరగానే కంప్లీట్ అయితే డెఫినెట్ గా ఈ రిలీజ్ కూడా ఉండొచ్చని చెప్పొచ్చు. సో సలార్ సోలో రిలీజ్ ఛాన్స్ లు తక్కువ ఉన్నాయని అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు