అమెజాన్‌లోకి “నూటొక్క జిల్లాల అందగాడు”.. తేదిపై రావాల్సిన క్లారిటీ..!

Published on Oct 1, 2021 3:00 am IST


అవసరాల శ్రీనివాస్, రుహానీశర్మ కాంబినేషన్‌లో రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “నూటొక్క జిల్లాల అందగాడు”. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల అయ్యింది. దిల్ రాజు మరియు క్రిష్ జాగర్లమూడి సమర్పణ లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మించారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రీమియర్‌కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇకపోతే ఈ సినిమాకి శ‌క్తికాంత్ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :