‘అసురన్’ కోసం వెంకటేష్ తో శ్రీకాంత్ అడ్డాల ?

Published on Nov 16, 2019 7:48 pm IST

‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ సినిమాని వెంకటేష్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నా.. ఈ సినిమాకి దర్శకుడిగా కొంతమంది పేర్లను పరిశీలించినా చివరికీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక వెట్రిమారన్ తెరకెక్కించ ఈ యాక్షన్ డ్రామా తమిళనాట సంచలన విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్ కి ఈ అసురన్ బాగా సెట్ అవుతుంది. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

ఇక వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

సంబంధిత సమాచారం :

More