చైతు కోసం స్క్రిప్ట్ రాస్తున్న బాహుబలి రైటర్ !

Published on Dec 5, 2018 7:49 pm IST

నాగ చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తన సతీమణి సమంతతో కలిసి ‘మజిలీ’ చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం అక్కినేని నాగ చైతన్య కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుక పడిన చైతూకి ఎలాగైన ఓ మంచి స్క్రిప్ట్ అందివ్వాలనే ఉద్దేశ్యంతో విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్ట్ రాస్తున్నారట.

కాగా ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’నే కావడంతో ఆ చిత్రం పై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.

ఇక ఈ చిత్రం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఉంటుందట. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More