‘ఎంఎల్ఎ’ ఆడియోకు ఎన్టీఆర్ గెస్ట్ ?
Published on Mar 13, 2018 2:40 am IST

ఈ నెల 17 న కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంఎల్ఎ’ సినిమా ఆడియో వేడుక కర్నూల్ లో జరగనుంది. ఈ ఆడియో వేడుకకు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని సమాచారం. కళ్యాణ్ రామ్ సినిమా కావున ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. చిత్ర యూనిట్ కూడా ఎన్టీఆర్ ను పిలవడం జరిగిందని తెలుస్తోంది.

కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ ల కామెడి బాగుంటుందని చెబుతున్నారు. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఈ సినిమాను అనుభవంగల దర్శకుడిలా తీర్చిదిద్దరాని సమాచారం. మార్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా ప్రసాద్ మురెళ్ళ కెమెరామెన్ గా పనిచెయ్యడం జరిగింది.

 
Like us on Facebook