ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ బాబాయ్ తో !

Published on Oct 12, 2018 8:22 pm IST


నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా ‘నందమూరి కళ్యాణ్ రామ్’ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా కళ్యాణ్ రామ్ ఇటీవలే ఈ చిత్ర షూట్ లో పాల్గొననున్నాడు. దాదాపు కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం 20 రోజులపాటు డేట్స్ ని కేటాయించారు. అయితే కళ్యాణ్ రామ్ తాజాగా ఈ చిత్రంలోని తన స్టిల్ కి సంబంధించిన పోస్టర్ ని పోస్ట్ చేస్తూ.. ’30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా.. నేను, మా నాన్నగారిలా. అని పోస్ట్ చేశారు.

ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :