ఎన్.టి.ఆర్ ‘రభస’ రిలీజ్ డేట్

Rabhasa

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రభస’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ముందుగా ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందు వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. కానీ ఆ తర్వాత కచ్చితమైన రిలీజ్ డేట్ వెలువడలేదు. తాజా సమాచారం ప్రకారం ‘రభస’ సినిమాని పక్కాగా ఆగష్టు 29న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం తెలిపింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా సమపాళ్ళలో ఉండనున్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత.