కృష్ణా, గుంటూరులో ఎన్టీఆర్ ఆల్‌టైమ్ రికార్డు!
Published on Sep 2, 2016 4:52 pm IST

janatha-garage-2
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా నిన్న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుంచీ తారాస్థాయిలో అంచనాలు ఉండగా, అభిమానులంతా మొదటిరోజే సినిమా చూసేయాలన్న ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు ఏపీ, తెలంగాణాల్లో సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఓపెనింగ్స్ విషయంలో తెలుగులో టాప్ 3 సినిమాల్లో ఒకటిగా ‘జనతా గ్యారెజ్’ నిలిచింది.

ముఖ్యంగా ఎన్టీఆర్‌కు తిరుగులేని క్రేజ్ ఉన్న గుంటూరు, కృష్ణా లాంటి ప్రాంతాల్లో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ రావడం విశేషంగా చెప్పుకోవాలి. కృష్ణా జిల్లాలో మొదటి రోజు ఈ సినిమా 1.54 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇక గుంటూరులో 2.58 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఈ రెండు ప్రాంతాల్లో ‘బాహుబలి’ని కూడా దాటేసి ‘జనతా గ్యారెజ్’ ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఐదు రోజుల అతిపెద్ద వీకెండ్ కావడంతో రానున్న నాలుగు రోజులూ ఈ సినిమాకు కలెక్షన్స్ ఇదే స్థాయిలో ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

 
Like us on Facebook