ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను కొంత కాలం క్రిందట భారీగా లాంచ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. వచ్చే నెల రెండో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్లో చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

‘జై లవకుశ’ సినిమా తరువాత ఎన్టీఆర్ చెయ్యబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ కు సంభందించి రకరకాల పేర్లు వినిపించినా వాళ్లెవరో త్వరలో ఆఫిషియల్ గా అనౌన్స్ చెయ్యనున్నారు చిత్ర యూనిట్. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని సమాచారం.