కథానాయకుడి కి భారీ కటౌట్ !

Published on Dec 25, 2018 10:24 am IST

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానుంది. అందులో భాగంగా మొదటి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈచిత్రం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ గెటప్ లో వున్నా బాలకృష్ణ యొక్క 100 ఫీట్ల భారీ కటౌట్ ను హైదాబాద్లోని నిజాంపేట క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేశారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబట్టి సినిమా ఫై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :