“బంగార్రాజు” నుండి నువ్వు సిగ్గుపడితే సాంగ్ టీజర్ విడుదల!

Published on Jan 20, 2022 4:52 pm IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం గా నిర్మించడం జరిగింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి విజయవంతం గా ప్రదర్శిపబడుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక సాంగ్ కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

అక్కినేని నాగార్జున మరియు రమ్య కృష్ణ ల నువ్వు సిగ్గుపడితే సాంగ్ కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తూ, బంగార్రాజు చిత్రం విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.దక్ష, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషం గా ఆకట్టుకుంటుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :