ఆకట్టుకుంటున్న ‘దసరా’ నుండి ‘ఓ అమ్మలాలో అమ్మలాలో’ సాంగ్

Published on Mar 28, 2023 6:12 pm IST

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మాస్ యాక్షన్ రస్టిక్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దసరా మార్చి 30న పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నాని ఈ సినిమాలో ధరణి పాత్రలో కనిపించనుండగా కీర్తి సురేష్, వెన్నల పాత్ర పోషించారు.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలోని మూడు సాంగ్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకోగా నేడు ఈ మూవీ నుండి ఓ అమ్మలాలో అమ్మలాలో అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించిన ఈ సాంగ్ ని రెహమాన్ రచించారు. చిన్నతనం నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఆకట్టుకునే విధంగా సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం అందరి నుండి మంచి ఆదరణ అందుకుంటూ యూట్యూబ్ లో కొనసాగుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :