‘యు’ సర్టిఫైతో రానున్న ‘ఒడియన్’ !

Published on Dec 10, 2018 10:12 pm IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’ అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 14వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధంగా ఉంది.

భారీ బడ్జెట్ తో శ్రీకుమార్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. జయచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రం మళయాళంతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదలకానుంది.

ఇక ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దగ్గుబాటి రామ్ మరియు సంపత్ కుమార్ ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :