ఆఫీషియల్ : అదే హై ఇచ్చే డేట్ కి “భీమ్లా నాయక్” రాక.!

Published on Nov 16, 2021 10:37 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మాస్ డ్రామా “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మళయాళ హిట్ సినిమా ‘అయ్యప్పణం కోషియం’ కి రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు.

అయితే గత కొన్నాళ్ల కితమే సినిమా రిలీజ్ డేట్ జనవరి 12కి ఫిక్స్ కాగా తర్వాత మళ్ళీ మారిన సమీకరణాల రీత్యా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని కొన్ని అప్డేట్స్ కి స్కిప్ చేశారు. దీనితో అసలు మెంటల్ గా అదే డేట్ కి సినిమాని ఫిక్స్ అయ్యిపోయిన అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు.

కానీ మధ్యలో కొన్ని డేట్స్ వినిపించినా ఇదే డేట్ కి వస్తుంది అని బజ్ కూడా ఉంది. ఇక దీనిని నిజం చేస్తూ చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ హై ఇచ్చే డేట్ నే సినిమాని తీసుకొస్తున్నట్టు సంగీత దర్శకుడు థమన్ చేత తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు అనౌన్స్ చేసేసారు.

సంబంధిత సమాచారం :