అఫీషియల్: ‘భారతీయుడు 3’పై బిగ్ అప్డేట్.. శంకర్ కంబ్యాక్ ఇస్తాడా?

అఫీషియల్: ‘భారతీయుడు 3’పై బిగ్ అప్డేట్.. శంకర్ కంబ్యాక్ ఇస్తాడా?

Published on Oct 8, 2026 12:08 PM IST

ఇండియన్ సినిమా ఓజి దర్శకుడు శంకర్ ఇప్పుడు పీక్ డౌన్ ఫాల్ లో ఉన్నారు. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని ఎప్పుడో అంతర్జాతీయ లెవెల్లో సెట్ చేసిన ఈ దర్శకుడు నుంచి వచ్చిన పలు ఎపిక్ సినిమాల్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో చేసిన సంచలన హిట్ చిత్రం ‘భారతీయుడు’ కూడా ఒకటి. అయితే దీనికి సీక్వెల్ అనౌన్స్ చేసి మళ్ళీ మంచి హైప్ సెట్ చేసుకున్నారు కానీ పార్ట్ 2 భారీ డిజాస్టర్ అయ్యింది.

అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా మూడో భాగం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఎక్కువే ఉన్నారు. నిజానికి అసలు కథ అంతా పార్ట్ 3 లో పెట్టి పార్ట్ 2 ఎందుకు రిలీజ్ చేసారని చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. ఇక అక్కడ నుంచి పార్ట్ 3 నేరుగా ఓటిటి విడుదల అని, అసలు సినిమానే రాదు అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ ఫైనల్ గా ఇప్పుడు మేకర్స్ ఇండియన్ 3/భారతీయుడు 3 పై బిగ్ అప్డేట్ అందించారు.

తమ కలయికలో పార్ట్ 3 ఉందని మొదలు పెట్టినట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే ఆల్రెడీ పార్ట్ 3 షూట్ చాలా వరకు అయ్యిపోయింది. ఇక మిగతా షూట్, వి ఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కావాల్సి ఉంది. మరి వీటిని ఎప్పటికి పూర్తి చేసి విడుదల చేస్తారో చూడాలి. అలాగే శంకర్ కంబ్యాక్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దీనితో సమాధానం ఇస్తారో లేదో కూడా చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు