‘కామ్రేడ్ కళ్యాణ్’లో అదెలా వర్కవుట్ అవుతుందో చూడాలి..?

‘కామ్రేడ్ కళ్యాణ్’లో అదెలా వర్కవుట్ అవుతుందో చూడాలి..?

Published on Oct 8, 2026 2:00 AM IST

Comrade Kalyan

‘ఆదర్శ కుటుంబం’ లాంటి పెద్ద సినిమా రావలసిన స్లాట్‌లో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ విడుదల కానుండటం ఈ చిన్న సినిమాకు లభించిన పెద్ద అవకాశంగా చెప్పవచ్చు. మొదట ‘కామ్రేడ్’ అనే శీర్షిక చూసి ఇదేదో సీరియస్ పొలిటికల్ మూవీ అనుకున్నప్పటికీ, ఫుల్ ఫన్ మోడ్‌లో సాగిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.

కొత్త దర్శకుడు జానకిరామ్ మారెళ్ళ తెరకెక్కించిన ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్, మంచి బజ్‌తో ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. అయితే, ఈ సినిమా కథ నక్సలిజం నేపథ్యం చుట్టూ తిరిగే పీరియడ్ సబ్జెక్ట్ కావడం, దానిపై పూర్తిస్థాయిలో కామెడీని నడిపించడం కొంత చర్చనీయాంశంగా మారింది. నక్సలిజం లాంటి సున్నితమైన అంశంపై వినోదాన్ని పండించడం కాస్త ఇబ్బందే.

అయినప్పటికీ మేకర్స్ పూర్తి నవ్వుల ప్రయాణంగానే దీనిని ప్రోజెక్ట్ చేస్తున్నారు. ఈ సీరియస్ ఎలిమెంట్‌ను, ఫన్ యాంగిల్‌ను దర్శకుడు ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశారో, ప్రేక్షకులు దీనిని ఎలా స్వీకరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు