ప్రస్తుతం తెలుగు సహా తమిళ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ చిత్రమే ‘జైలర్ 2’. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేసిన ఈ మ్యాడ్ సీక్వెల్ పట్ల భారీ అంచనాలు సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గరకి వస్తున్న సమయంలో మేకర్స్ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
రజిని, నెల్సన్ కి నడుమ జరిగిన సంఘర్షణలో ఫైనల్ గా రజిని కోరికే సక్సెస్ అయ్యి సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు రివీల్ చేశారు. అయితే దీనితోనే జైలర్ 2 లో రజినీకాంత్ పై వింటేజ్ ట్రీట్ మళ్ళీ ఉంటుందా అనే ప్రశ్నకి సమాధానం కూడా దొరికింది అని చెప్పొచ్చు. పార్ట్ 1 లో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో రజినీని డీ ఏజ్ లుక్ లో ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ కి నెల్సన్ సాలిడ్ ట్రీట్ అందించాడు.
ఇప్పుడు సెన్సార్ అనౌన్సమెంట్ పోస్టర్ లో ఈ లుక్ మళ్ళీ కనిపిస్తుంది. సో డెఫినెట్ గా మరోసారి వింటేజ్ సూపర్ స్టార్ బిగ్ స్క్రీన్స్ పై మెరవబోతున్నారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సాలిడ్ మ్యూజిక్ అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 15న గ్రాండ్ గా సినిమా విడుదల కాబోతుంది.


