సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమానే రణబాలి. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ సినిమాపై మంచి ఆసక్తి పెంచింది.
ఇలా ఫైనల్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ కట్ విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. నేడు సాయంత్రం విడుదల చేయనున్న ఆ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందా అని అందరి కళ్ళు దీనిపై పడ్డాయి. ఆల్రెడీ టీజర్ లోనే దాదాపు కంటెంట్ రివీల్ చేయబడింది. ఇక ట్రైలర్ ని అంతకుమించి నిడివితో వదలబోతున్నారు. సో ఈ ట్రైలర్ లో అంత ఎగ్జైట్ చేసే కొత్త కంటెంట్ ఏముంటుంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి అజయ్, అతుల్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


