ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన భారీ హిట్ ‘మండాడి’!

ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన భారీ హిట్ ‘మండాడి’!

Published on Oct 8, 2026 9:00 AM IST

ఈ ఏడాది కోలీవుడ్ సినిమా దగ్గర అద్భుతంగా రాణించిన సినిమాల్లో కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు సూరి హీరోగా టాలీవుడ్ యువ నటుడు సుహాస్ విలన్ గా నటించిన సముద్రపు బ్యాక్ డ్రాప్ రేసింగ్ డ్రామా ‘మండాడి’ కూడా ఒకటి. దర్శకుడు మథిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ చిత్రం భారీ వసూళ్లు సాధించి సూరి కెరీర్ లోనే రికార్డు హిట్ గా నిలిచింది.

ఇక అంతే కాకుండా ఇప్పటికీ థియేటర్స్ లో బాగానే రన్ అవుతూ ఐమ్యాక్స్ వెర్షన్ డిమాండ్ తో మళ్ళీ ఈ 9 నుంచి విడుదల కాబోతున్న సినిమా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలోకి వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఇందులో నేటి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు ఎవరైనా ఈ సినిమా మిస్ అయితే మాత్రం ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా ఎల్రెడ్ కుమార్ సంతానం నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు