గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన క్రేజీ ప్రాజెక్ట్ ‘దాదా’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఇటీవల చిన్న గాయం కారణంగా విరామం తీసుకున్న బాలయ్య మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడంతో చిత్రబృందంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
‘బ్యాక్ టు సెట్స్.. బ్యాక్ టు ది ఎనర్జీ.. బ్యాక్ టు ది మ్యాడ్‌నెస్’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ యాక్షన్ మోడ్‌లోకి వచ్చిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి దాదా ఈ క్రిస్మస్‌కు ఎలాంటి మాస్ ఫీస్ట్ అందిస్తాడో వేచి చూడాలి.
Back to the sets…
Back to the energy…
Back to the madness 🦁🦁N.B.K is back in action, resuming the shoot of #DADA 💥💥
This Christ-Mass will be a celebration for every season – December 24th 🔥
#DadaOnDec24th 🌋
GOD OF MASSES #NandamuriBalaKrishna @heromanoj1 @MsKajalAggarwal @megopichand @musicthaman @Venkataskilaru #ArvindKashyap @NavinNooli #AsPrakash #SaiMadhavBurra @vriddhicinemas @NBKisDADA @zeestudiossouth— Vriddhi Cinemas (@vriddhicinemas) October 7, 2026


