ఇండియన్ సినిమా దగ్గర తమ వెర్సటైల్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ నటుల్లో బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ కూడా ఒకరు. తన మార్క్ సాలిడ్ నటనతో ఇండియా వైడ్ గా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేశారు. అయితే దక్షిణాదిలో ఒకింత చేశారు కానీ తన పెర్ఫామెన్స్ తాలూకా పొటెన్షియల్ ఏపాటిదో తెలియాలి అంటే సూపర్ స్టార్ రజినీతో చేసిన ‘కాలా’లో చూస్తే తెలుస్తుంది.
అయితే ఆయన విషయంలో ఓ విషాద వార్త ఇపుడు బయటకి వచ్చింది. నానా పాటేకర్ ఇక లేరు అనే మాట సినీ పరిశ్రమని దిగ్భ్రాంతికి లోను చేసింది. ఇవాళ తెల్లవారు జాము 5 గంటల 25 నిమిషాల సమయంలో గుండెపోటు రావడంతో గోవాలోని తన స్వగృహంలోనే కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
జనవరి 1, 1951 లో జన్మించిన నానా పాటేకర్ 1978లో సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. తాను హిందీ, మరాఠి సినిమాలో కలిపి 90కి పైగా సినిమాల్లో నటించారు. వెండితెరపై తనదైన నటనతో ముద్ర వేసుకున్న తాను ఇప్పుడు లేరు అనే మాట ఎంతోమందిని తీవ్రంగా కలిచివేస్తుంది. ఖచ్చితంగా వారు లేని లోటు భారతీయ సినిమా దగ్గర ఒక తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మన 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.


