అఫీషియల్ : “పఠాన్” స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.!

Published on Mar 21, 2023 7:06 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా జాన్ అబ్రహం సాలిడ్ విలన్ రోల్ లో నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ సినిమా “పఠాన్” కోసం తెలిసిందే. దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ నుంచి వచ్చిన మరో భారీ యాక్షన్ సినిమా ఇది కాగా బాలీవుడ్ సినెమలో అయితే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా రికార్డు వసూళ్ళ తో సంచలనం రేపగా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.

మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అయితే ఈ సినిమా రేపు మార్చ్ 22 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనున్నట్టు గా కన్ఫర్మ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానున్నట్లు లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక కామియో రోల్ లో కనిపించగా యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :