ఇంట్రెస్టింగ్.. మరోసారి “అనిమల్” హీరోయిన్స్ ఒకే సినిమాలో కనిపిస్తారా?

ఇంట్రెస్టింగ్.. మరోసారి “అనిమల్” హీరోయిన్స్ ఒకే సినిమాలో కనిపిస్తారా?

Published on May 25, 2024 1:02 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర రానున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” (Pushpa 2 The Rule) కూడా ఒకటి. మరి దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మాస్ ఫీస్ట్ లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఎప్పుడు నుంచో అనేకమంది స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తూ వస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా బాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి (Tripthi Dimri) చేస్తున్నట్టుగా క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇది కానీ నిజం అయితే “అనిమల్” హీరోయిన్స్ ఇద్దరూ మరోమారు మరో బిగ్గెస్ట్ సినిమాలో కనిపిస్తున్నట్టే అని చెప్పాలి. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన అనిమల్ లో రష్మిక, త్రిప్తి ఇద్దరూ సాలిడ్ రోల్స్ చేశారు. ఇక ఇప్పుడు పుష్ప విషయంలో మళ్ళీ వినిపిస్తుండడంతో మరోసారి ఈ పాన్ ఇండియా సినిమాతో ఇద్దరూ ఆడియెన్స్ ని అలరించనున్నారని చెప్పాలి. మరి త్రిప్తి ఈ సినిమాలో ఉందో లేదో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు