శర్వాకు ఒక హీరోయిన్ అయితే దొరికేసింది !
Published on Oct 12, 2017 9:09 am IST

ఇటీవలే ‘మహానుభావుడు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ తన తర్వాతి సినిమాకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా శర్వా సరసన హీరోయిన్లను ఎంపిక చేసే పనులు కూడా కొనసాగుతున్నాయి. వాటిలో భాగంగానే శర్వా చేయనున్న రెండు పాత్రల్లో ఒక పాత్రకు జోడీగా నివేతా థామస్ ను సెలెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సమాచారంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక రెండవ హీరోయిన్ గా కూడా ఇప్పటి వరకు శర్వానంద్ తో కలిసి నటించని నటి అయితే బాగుంటుయిందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఆ రెండవ హీరోయిన్ గా ఎవరని ఎంపిక చేస్తారో చూడాలి. సూర్యదేవర నాగ వంశీ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది.

 
Like us on Facebook