వరుణ్ తేజ్ సినిమాలో ప్రత్యేకంగా పాటలేవీ ఉండవట !
Published on Feb 22, 2018 10:34 am IST

ఇటీవలే ‘తొలిప్రేమ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమాకు సమాయత్తమవుతున్నారు. ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం అంతరిక్షం నైపథ్యంలో ఉండనుంది. ఏప్రిల్ నెల నుండి జార్జియాలో షూట్ జరుపుకోనున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ జీరో గ్రావిటీ పరిస్థితుల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడు.

ఇకపోతే తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ప్రత్యేకంగా పాటలేమీ ఉండవట. కేవలం కథను వివరిస్తూ బ్యాక్ గ్రౌండ్లో నడిచే సాంగ్స్ మాత్రమే ఉంటాయట. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నాడు. వరుణ్ తేజ్ అంతరిక్ష వ్యామగామిగా కనిపించనున్న ఈ చిత్రాన్ని 2018 చివరికి విడుదలచేయాలనే యోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

 
Like us on Facebook