మరో రెండు బాషల్లో అందుబాటులోకి వచ్చిన “ఆపరేషన్ వాలెంటైన్”

మరో రెండు బాషల్లో అందుబాటులోకి వచ్చిన “ఆపరేషన్ వాలెంటైన్”

Published on Mar 25, 2024 9:06 PM IST

టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మానుషి చిల్లర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషలలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను రాబట్టలేదు. గత శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్‌గా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం ఇప్పుడు తెలుగు మరియు తమిళంలో మాత్రమే కాకుండా కన్నడ మరియు మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రం కి సంబందించిన హిందీ వెర్షన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. నవదీప్, రుహాని శర్మ, పరేష్ పహుజా, షతాఫ్ ఫిగర్, సంపత్, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు