వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “ఓరి దేవుడా”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “ఓరి దేవుడా”

Published on Apr 23, 2023 10:27 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, డైరెక్టర్ ఆశ్వత్ మరిముతు దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓరి దేవుడా. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.

మిథిలా పాల్కర్, ఆశా భట్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 30 వ తేదీన సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో ప్రసారం కానుంది. విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో నటించిన ఈ చిత్రం కి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు