ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న “హాయ్ నాన్న”

ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న “హాయ్ నాన్న”

Published on Dec 30, 2023 12:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మరో టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా “హాయ్ నాన్న”. నాని కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 30వ ప్రాజెక్ట్ గా తెరకెక్కించగా ఇప్పుడు ఈ చిత్రంతో నాని తన కెరీర్ లో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో తన నుంచి రెండు సినిమాలు రిలీజ్ హిట్ అందుకున్నాడు.

ఇక ఈ చిత్రం ఇపుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి థియేటర్స్ లో కూడా బాగానే రాణించిన ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు