విజయ్ “గోట్” ఓటిటి పార్ట్నర్ లాక్?

విజయ్ “గోట్” ఓటిటి పార్ట్నర్ లాక్?

Published on Jan 31, 2024 5:46 PM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “గోట్” కోసం అందరికీ తెలిసిందే. “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అంటూ తెరకెక్కుతున్న ఈ చిత్రంని మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మరి విజయ్ డ్యూయల్ రోల్స్ లో ఈ సినిమాలో కనిపిస్తుండగా ఇప్పుడు వరకు వదిలిన అప్డేట్ ఆడియెన్స్ లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

దీనితో ఈ చిత్రం ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు