ఆక్సిజన్, ఇంద్రసేనా, జవాన్ విజయం ఎవరిది ?
Published on Nov 28, 2017 7:05 pm IST

ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు విడుదల అవుతుంటాయి. కాని ఈసారి గురువారం రెండు సినిమాలు శుక్రవారం ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వివరాల్లోకి వెళ్ళితే.. విజయ్ అంథోని నటించిన ఇంద్రసేనా సినిమా, గోపీచంద్ ఆక్సిజన్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా శుక్రవారం సాయి ధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమా విడుదల కానుంది.

రెండు విభిన్న పాత్రల్లో అన్నా తమ్ముడి పాత్రల్లో విజయ్ అంథోని ఇంద్రసేనా సినిమాలో కనిపించబోతున్నాడు. బ్రదర్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి. ఆక్సిజన్ సినిమా తనకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెడుతుందనేనమ్మకంతో ఉన్నాడు గోపీచంద్. సోషల్ పాయింట్ తో రాబోతున్న జవాన్ సినిమా విజయంపై నమ్మకంగా ఉంది చిత్ర యూనిట్. చూడాలి ఈ మూడు సినిమాల్లో ఈ సినిమా విజయం సాదిస్తుందో.

 
Like us on Facebook