ఓయ్ నిన్నే… భావ మరదలు ప్రేమ కథ!
Published on Oct 5, 2017 10:42 am IST

సత్య చల్లకోటి దర్శకత్వంలో వంశీ కృష్ణ నిర్మించిన చిత్రం ఓయ్ నిన్నే. ఈ సినిమాలో భరత్ మార్గాని హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర హీరో మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హీరో భార్గవ్ చిత్రం విశేషాలు చెబుతూ. ఇది ఒకరంటే ఒకరికి పడని తండ్రి కొడుకుల కథ. కొడుకుని అంతగా ద్వేషించే తండ్రి తన కొడుకు బంగారం అనేలా హీరో ఎలా చేసుకున్నాడు అనేది సింపుల్ గా కథ అని చెప్పాడు. అలాగే సినిమాలో భావ మరదళ్ల మధ్య సాగే సరదా సరదా ప్రేమ కథ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని భరత్ చెప్పాడు.

తాను యూ.ఎస్ లో మెడిసన్ చేశా అని, ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు వైజాగ్ వచ్చిన తనని చూసి వంశీ కృష్ణ గారు సినిమాలో అవకాశం ఇచ్చారని చెప్పాడు. తనకు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున గారు అంటే ఇష్టం అని ఆయన స్ఫూర్తితోనే యాక్టింగ్ కెరియర్ ఎంచుకున్న అని చెప్పాడు. డిసెంబర్ లో తన రెండో సినిమా స్టార్ట్ అవుతుందని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పంచుకున్నాడు.

 
Like us on Facebook