రొమాంటిక్ టచ్ తో వచ్చిన ‘పడి పడి లేచె మనసు’ !

Published on Oct 10, 2018 11:24 am IST

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ చిత్ర టీజర్ ఈ రోజు ఉదయం 9:30 గంటలకు విడుదల అయింది. టీజర్ ప్రధానంగా హీరో హీరోయిన్ల మీద రొమాంటిక్ ఫీల్ తో సాగింది. శర్వానంద్ లుక్ కూడా కొత్తగా కనిపించడంతో టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది.

ఇక ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ గా కనిపించనుంది. ముఖ్యంగా శర్వానంద్, సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్, వారి పాత్రల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నా ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :