“సలార్” కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రభాస్..?

Published on May 27, 2022 1:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మరో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఇది ఒక్క ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ప్రశాంత్ నీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా షెడ్యూల్ షెడ్యూల్ కి కాస్త గ్యాప్ వచ్చి స్టార్ట్ అవుతున్నా ప్రభాస్ మాత్రం ఆ షెడ్యూల్స్ ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నాడట. అంతే కాకుండా ప్రభాస్ ఈ సినిమా కోసం రేయింబవళ్లు చాలా కష్టపడుతున్నాడని కూడా తెలుస్తుంది. అంతే కాకుండా తన కాలికి నొప్పి ఉన్నా కూడా షూట్ లో పాల్గొంటున్నట్టు టాక్. రీసెంట్ గా అయితే మేకర్స్ అర్ధ రాత్రి 1 గంట వరకు షూటింగ్ జరిపారు.

మొత్తానికి అయితే ఈ భారీ సినిమా ఇలా షూటింగ్ ని జరుపుకుంటూ పూర్తవుతుంది. ఇక ఈ సినిమాలో శృతుఈ హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబలే ఫిల్మ్స్ వారే నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :