మరో కొత్త హీరోను లాంచ్ చేయనున్న జయంత్ సి పరాంజీ !
Published on Dec 6, 2017 12:53 pm IST

సీనియర్ దర్శకుడు, వెకంటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి మంచి హిట్లందుకున్న జయంత్ సి పరాంజీ ఇటీవలే మంత్రి ఘంటా శ్రీనివాసరావ్ కుమారుడు ఘంటా రవిని ‘జయదేవ్’ చిత్రంతో హీరోగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ దర్శకుడు మరొక కొత్త హీరోని లాంచ్ చేయనున్నారు.

అతనే నీలేష్. నీలేష్ హీరోగా ‘నరేంద్ర’ అనే సినిమాని లాంచ్ చేశారు. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్లో ఉండనున్న ఈ సినిమాను ఎక్కువ భాగం ఇండో పాకిస్థాన్ బోర్డర్లో చిత్రీకరిస్తారట. ఈ చిత్రం పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఈషాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోడల్ లాజాబెల్లే హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ తేదీ, ఇతర విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook