గీత గోవిందం డైరక్టర్ మళ్ళీ గీతా ఆర్ట్స్ లోనే !

Published on Dec 11, 2018 11:20 am IST

‘గీత గోవిందం’ తో తిరుగులేని విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు పరుశురాం. గీతా ఆర్ట్స్ 2 పతాకం ఫై నిర్మితమైన ఈ చిత్రం విడుదలై 4నెలలు కావస్తున్నా ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు ఈ డైరెక్టర్. అయితే పరుశరాం రెండు పెద్ద బ్యానేర్లలో సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్ కాగా మరొకటి మైత్రీ మూవీ మేకర్స్. అయితే వీటిలో ముందుగా గీతా ఆర్ట్స్ లోనే సినిమా చేశే అవకాశాలు వున్నాయని సమాచారం. ప్రస్తుతం పరుశురాం రెండు స్క్రిప్ట్ లతో రెడీ గా వున్నాడట. తర్వలోనే తన కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నాడు.

ఇక అన్ని కుదిరితే ఈ దర్శకుడు , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా సినిమా చేసే అవకాశాలు వున్నాయట. పరుశురాం ఎప్పటి నుండో బన్నీ తో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :