‘బయటికొచ్చి చూస్తే’ పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ !
Published on Nov 7, 2017 9:07 am IST

ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్బంగా ఆయన పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రంలోని మొదటి పాట ‘బయటికొచ్చి చూస్తే’ ను నిన్న రాత్రి రిలీజ్ చేశారు. అప్డేట్స్ కోసం ఎంతగానో వేచి చూస్తున్న అభిమానులు ఈ పాటతో చాలా బాగా సంతృప్తి చెందారు. అభిమానులు, సంగీత ప్రియుల నుండి పాటకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. పాట విన్న ప్రతి ఒక్కరు చాలా స్టైలిష్ గా, కొత్తగా ఉందంటూ పొగిడేస్తున్నారు.

అనిరుద్ ట్యూన్స్ తో పాటు, గాత్రం, శ్రీముని లిరిక్స్ కలిసి పాటను మళ్ళీ మళ్ళీ వినాలనేలా తీర్చిదిద్దాయి. ఈ పాటతో ఆల్బమ్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. తెలుగులో మొదటిసారి వర్క్ చేస్తున్న అనిరుద్ కు ఈ చిత్రం మంచి ఎంట్రీ అవుతుందని చెప్పొచ్చు. ఈ పాటకు సంబందించి లిరికల్ వీడియో ఈరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ కానుంది. ఇక మొత్తం పాటల్ని డిసెంబర్లో మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం బల్గెరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది.

 
Like us on Facebook