ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించిన పవన్ కళ్యాణ్ !
Published on Apr 13, 2017 5:48 pm IST


‘జనసేన’ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసినప్పటి నుండి సినీ నటుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న అన్ని రాజకీయ అంశాలను నిశితంగా గమిస్తూ వాటి పట్ల తన ధోరణి ఏంటి, భవిషత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై ట్విట్టర్లో ట్వీట్ల రూపంలో ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రత్యేక హోదాపై అయితే పవన్ ఎడతెరిపి లేకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలని నిలదీస్తూనే ఉన్నారు.

ఈరోజైతే పవన్ ప్రశించిన తీరులో తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు సభలో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని, వాళ్లకన్నా ప్రతి పక్షం వైసీపీ సభ్యులే మేలని అన్నారు. అంతేగాక టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, దయచేసి టీడీపీ ప్రభుత్వం ఏపి యొక్క ఆత్మగౌరవాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తానూ అధికారంలో ఉన్న యూపిని ఏపిని విడగొట్టిన విధానంలోనే విడగొట్టగలదా అంటూ పదునైన ప్రశ్నలు సంధించారు.

 
Like us on Facebook