పవర్ఫుల్ గా పవన్, బాలయ్య “అన్ స్టాప్పబుల్” గ్లింప్స్.!

పవర్ఫుల్ గా పవన్, బాలయ్య “అన్ స్టాప్పబుల్” గ్లింప్స్.!

Published on Jan 15, 2023 11:08 AM IST

గత కొన్ని రోజులు నుంచి తెలుగు ఓటిటి వీక్షకుల అటెన్షన్ ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి “ఆహా” వారు పట్టుకున్నారు. మరి రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి హీరోని తీసుకొచ్చి సరికొత్త ప్రభాస్ ని ప్రెజెంట్ చేయగా దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఎపిసోడ్ తర్వాత మరో ఊహించని గెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బాలయ్య తో ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి ఆశ్చర్య పరిచారు.

ఇక ఈరోజు సంక్రాంతి కానుకగా అయితే ఈ అవైటెడ్ కాంబినేషన్ పై గ్లింప్స్ ని వదులుతున్నట్టుగా అనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ గ్లింప్స్ రానే వచ్చింది. మరి ఇది కంప్లీట్ గా పవర్ఫుల్ లెవెల్లో ఉందని చెప్పాలి. మరియు మరియు పవన్ లకు ఆహా ప్రాంగణం అంతా అభిమానులతో నిండిపోగా పవన్ మరియు బాలయ్యలు కలిసి ఉన్న ఒకే ఫ్రేమ్ ఇన్నేళ్ల తర్వాత చూసేందుకు అభిమానులకి రెండు కళ్ళు సరిపోలేదు.

ఇక లాస్ట్ లో అయితే బాలయ్య పవన్ ని మేజర్ చెయ్యాలి అంటూ అన్న మాటకు పవన్ నవ్వడంతో ఈ గ్లింప్స్ మంచి పవర్ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ గా క్లోజ్ అయ్యింది. ఇక ఈ అవైటెడ్ ఎపిసోడ్ అయితే అతి త్వరలోనే ఆహా లోకి స్ట్రీమింగ్ కి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు