పవన్ కోసం భారీ ఏర్పాట్లు చేసిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ టీమ్!
Published on Nov 6, 2016 9:58 am IST

pawan-kalyan-saptagiri
కమెడియన్‌గా స్టార్ స్టేటస్ సంపాదించి, ఇప్పుడు తెలుగులో ప్రతి సినిమాలోనూ దర్శనమిస్తోన్న సప్తగిరి, తాజాగా పూర్తి స్థాయి హీరో పాత్రలో నటించిన సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శిష్యుడైన అరుణ్ పావర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని నేడు ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకునేందుకు సిద్ధమైపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయనుండడం విశేషంగా చెప్పుకోవాలి.

దర్శక, నిర్మాతల కోరిక మేరకు పవన్ ఈ ఆడియో వేడుకకు వచ్చేందుకు ఓకే చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే సాయంత్రం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుక కోసం టీమ్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. పవన్ హాజరు కానుండడంతో ఎక్కువ మంది అభిమానులు వస్తారన్న ఆలోచనతో భారీగా ఏర్పాట్లు చేశారు. నవంబర్ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 
Like us on Facebook